కాకినాడ రూరల్ రాయుడుపాలెం వద్ద గురువారం ఉదయం స్కూలు పిల్లలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తా పడగా, లారీ ఆగకుండా వెళ్లిపోయింది. ఎస్పీ బిందుమాధవ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, సీసీ కెమెరాల ఆధారంగా 'AP39 UE3879' నంబరు గల లారీగా గుర్తించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు సర్పవరం సిఐ పెద్దిరాజు నిర్ధారించారు.