కాకినాడ: స్వచ్ఛందంగా బంద్ పాటించండి

342చూసినవారు
కాకినాడ: స్వచ్ఛందంగా బంద్ పాటించండి
రైతు, కార్మిక సంఘాలు తలపెట్టిన ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెకు మద్దతు తెలపాలని కోరుతూ కాకినాడ మర్చంట్ అసోసియేషన్ నాయకుడు గ్రంధి బాబ్లీకి గురువారం సమ్మె నోటీసు అందజేశారు. కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ల వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుందని కార్మిక నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, ఎఐటియుసి ప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్