కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో నూతనంగా ఎంపికైన 10 మంది అంగన్‌వాడీ సహాయకులకు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే పంతం నానాజీ, అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణీలకు అంకితభావంతో సేవలు అందించాలని సూచించారు.