కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్,
వైసీపీ కులాల మధ్య విభేదాలు సృష్టించి
రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక ఈ కుల రాజకీయాలకు తెరలేపిందని ఆయన విమర్శించారు. ప్రజలు అన్ని పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారని, వాస్తవాలను గుర్తించి సరైన సమయంలో తీర్పు ఇస్తారని ఎంపీ పేర్కొన్నారు.