ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కాకినాడ రూరల్‌లో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేందుకు విచ్చేసిన సందర్భంగా, శుక్రవారం సర్పవరం జంక్షన్‌లో కూటమి శ్రేణులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.