పెద్దాపురం పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై)గా యూ. పాపారావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నేరాల నియంత్రణ, మహిళల భద్రత, రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తామని పాపారావు తెలిపారు.