రాజమహేంద్రవరం రూరల్ కాతేరులో
జనసేన నాయకుడు కొయ్యల పోసిబాబు ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 500 మందికి ఉచిత వైద్య
పరీక్షలు, మందులు, కళ్లజోళ్లు పంపిణీ చేశారు. స్వచ్ఛ రాజమహేంద్రవరం–స్వచ్ఛ కాతేరు నినాదంతో జనసైనికులు పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు. అనంతరం 600 మందికి అన్నదానం నిర్వహించారు. ప్రజలకు సేవ చేయడం ఆనందంగా ఉందని కొయ్యల పోసిబాబు తెలిపారు.