కాకినాడ జిల్లాలో పీఎన్‌జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) పైపులైన్ల విస్తరణ పనులకు అవసరమైన అనుమతులను త్వరితగతిన జారీ చేయాలని సంయుక్త కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి యుటిలిటీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. గ్యాస్ కనెక్షన్ల ఏర్పాటుకు ఉన్న అడ్డంకులను శాఖల సమన్వయంతో తొలగించాలని, ప్రజలకు అవగాహన కల్పించి మరింత మంది పీఎన్‌జీ కనెక్షన్లు పొందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.