కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ (డిఆర్ఓ) తిప్పయ్య నాయక్ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన 8 పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణమోహన్, టిడిపి ప్రతినిధి గదులు సాయిబాబా,
జనసేన ప్రతినిధి అడబాల సత్యనారాయణ, వైఎస్ఆర్సిపి ప్రతినిధి వై వెంకటేశ్వర్లు,
కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పోలిశెట్టి శ్రీనివాస్, బీఎస్పీ ప్రతినిధి అప్పారావు, సిపిఎం ప్రతినిధి పలివెల వీరబాబు హాజరయ్యారు. ఎన్నికల ప్రక్రియపై చర్చించారు.