మృతి చెందిన విద్యార్థిని కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం

18చూసినవారు
మృతి చెందిన విద్యార్థిని కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం
కాకినాడ రూరల్ మండలం రాయడుపాలెంలో జరిగిన ఆటో ప్రమాదంలో మృతి చెందిన 9 ఏళ్ల విద్యార్థిని కే. ఐశ్వర్య కుటుంబానికి ఎంపీ సానా సతీష్ ఫౌండేషన్ అండగా నిలిచింది. శుక్రవారం ఫౌండేషన్ ఛైర్మన్ తలాటం హరీష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఎంపీ సానా సతీష్ తరపున రూ. 2 లక్షల ఆర్థిక సాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాధిత కుటుంబానికి మానసికంగా, ఆర్థికంగా ఫౌండేషన్ ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వ పరంగా కూడా అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్