సర్పవరం: ఆటో బోల్తా.. చిన్నారి మృతి

1431చూసినవారు
సర్పవరం: ఆటో బోల్తా.. చిన్నారి మృతి
కాకినాడ జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కాకినాడ రూరల్లోని కేంద్రీయ విద్యాలయ పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఆటో రాయుడుపాలెం సెంటర్లో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నాలుగో తరగతి చదువుతున్న ఐశ్వర్య అనే విద్యార్థిని తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందింది. స్వల్పంగా గాయపడిన మరో ఎనిమిది మంది విద్యార్థులను కాకినాడ జనరల్ ఆసుపత్రికి తరలించారు. లారీ ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. సర్పవరం పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాద సమయంలో ఆటోలో 11 మంది విద్యార్థులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్