మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా పెద్దాపురంలో సీపీఎం నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాద రావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని, గాంధీజీ పేరును తొలగించడం బాధాకరమని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కాపాడుతామని నాయకులు ప్రతిజ్ఞ చేశారు.