ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ శాఖల అధికారులు బడ్జెట్ నిధులను సక్రమంగా వినియోగించాలని కాకినాడ ఆర్డీవో, రూరల్ నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ ఎస్. మల్లిబాబు సూచించారు. గురువారం కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన 'బడ్జెట్ ఔట్ రీచ్' సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా 29 ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు హాజరై, తమ శాఖలకు కేటాయించిన బడ్జెట్ వివరాలు, ఖర్చులను వెల్లడించారు.