కాకినాడలో కూరగాయల ధరలకు రెక్కలు

582చూసినవారు
కాకినాడలో కూరగాయల ధరలకు రెక్కలు
కాకినాడలో కూరగాయల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వంకాయ ధర కిలో రూ. 60 వరకు చేరడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర కాయగూరల ధరలు కూడా కిలోకు రూ. 50కుపైనే కొనసాగుతున్నాయి. రైతుబజార్లలోనే అధిక ధరలు ఉండగా, రిటైల్ మార్కెట్లలో మరింత ఎక్కువగా విక్రయిస్తున్నారు. ఎండల తీవ్రత కారణంగా పంట దిగుబడులు తగ్గిపోవడం వల్లే ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. వర్షాలు కురిసి సరఫరా పెరిగే వరకు ధరలు తగ్గే అవకాశం లేదని పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్