
స్వామినగర్ వద్ద ఫ్లెక్సీల తొలగింపుపై ఆందోళన
కాకినాడ రూరల్ మండలం స్వామినగర్ బ్రిడ్జి వద్ద క్రైస్తవులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అక్రమంగా తొలగించారని రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం ఆరోపించింది. సంఘం అధ్యక్షుడు నక్కా రాజశేఖర్ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన నిర్వహించి, ఫ్లెక్సీ తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఫ్లెక్సీని యథావిధిగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.






































