
కొత్తపేట డివిజన్లో పోలీస్ యాక్ట్-30 అమలు
కొత్తపేట సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఫిబ్రవరి 28 వరకు సెక్షన్-30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని DSP సుంకర మురళీ మోహన్ తెలిపారు. సోమవారం జారీ అయిన ఈ ఉత్తర్వులు కొత్తపేట, రావులపాలెం, రాజోలు సహా 11 మండలాలకు వర్తిస్తాయి. ఈ కాలంలో సభలు, ఊరేగింపులకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

































