వాడపల్లి వేంకన్న కల్యాణానికి ఘనంగా అంకురార్పణ

230చూసినవారు
కోనసీమలోని తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామి వార్షిక కల్యాణ మహోత్సవాలు శనివారం అంకురార్పణతో ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు ధ్వజారోహణ నిర్వహించి సకల దేవతలకు ఆహ్వానం పలికారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ సూర్యచక్రధర్ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.
Job Suitcase

Jobs near you