ఆలమూరు: సాంకేతికతతో ప్రాణం కాపాడిన పోలీసులు

795చూసినవారు
ఆలమూరు: సాంకేతికతతో ప్రాణం కాపాడిన పోలీసులు
ఆలమూరులో కుటుంబ గొడవలతో విరక్తి చెంది గోదావరిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన రవికిరణ్ అనే యువకుడిని పోలీసులు ఆదివారం చాకచక్యంగా రక్షించారు. యువకుడి సోదరి ఇచ్చిన సమాచారంతో స్పందించిన పోలీసులు, మొబైల్ సిగ్నల్ ఆధారంగా అతడు జొన్నాడ బ్రిడ్జి వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఆలమూరు ఎస్సై నరేష్ బృందం తక్షణమే అక్కడికి చేరుకుని యువకుడిని కాపాడారు. సమయస్ఫూర్తితో ప్రాణాలు కాపాడిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు.

సంబంధిత పోస్ట్