ఆలమూరు మండలం సంధిపూడిలో గురువారం జరిగిన ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంలో పాల్గొన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రెండు విడతల అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేశామని, అన్నదాతలకు అండగా ప్రభుత్వం చైతన్యవంతమైన పథకాలు అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.