కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆయన కుటుంబంపై
వైసీపీ నేతలు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను ఆలమూరు మండల కూటమి నాయకులు ఆదివారం తీవ్రంగా ఖండించారు. వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు మాని, ప్రజా సమస్యలు, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. సామాజికవర్గాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం సరికాదని స్పష్టం చేశారు.