రావులపాలెం మండలం ఊబలంక వద్ద గురువారం ఆటో బోల్తా పడి పలువురు మహిళలు గాయపడ్డారు. అయ్యప్ప ఆలయంలో వంట పనులు ముగించుకుని మూలస్థానానికి వెళ్తున్న మహిళా సిబ్బంది ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.