వాడపల్లి వెంకన్న సన్నిధిలో విజయవాడ దుర్గా దేవస్థానం చైర్మన్

828చూసినవారు
విజయవాడ దుర్గా దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) బుధవారం తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక ఆలయాన్ని సందర్శించి, శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు ఆయనకు సాదర స్వాగతం పలికి, స్వామి వారి దర్శనం కల్పించారు. అనంతరం రాధాకృష్ణకు స్వామి వారి చిత్రపటాన్ని మరియు ప్రసాదాలను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు మరియు ఇతర ముఖ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్