రూ. 30 లక్షలతో బడుగువానిలంకకు తారు రోడ్డు నిర్మాణం

67చూసినవారు
రూ. 30 లక్షలతో బడుగువానిలంకకు తారు రోడ్డు నిర్మాణం
ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామస్థుల దశాబ్దాల కల నెరవేరింది. గతంలో బురదతో నిండిన రోడ్డును కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చొరవతో రూ. 30 లక్షలతో బిటి రోడ్డుగా నిర్మించారు. 'సెల్ఫీ ఛాలెంజ్'లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేశారు. దీంతో బడుగువానిలంక, చెముడులంక, మడికి, చొప్పెల్ల గ్రామాల రైతులు, వాహనదారుల ఇబ్బందులు తొలగిపోయాయి. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యేకు లంక గ్రామాల ప్రజలు ఆదివారం కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్