ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జోరుగా వర్షం కురుస్తున్నా, భక్తులు లెక్కచేయకుండా స్వామి వారి మాడ వీధుల్లో నిష్టతో ప్రదక్షిణలు చేశారు. వర్షం కారణంగా చల్లబడిన వాతావరణంలో గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తుల భక్తి దృశ్యం అందరినీ ఆకట్టుకుంది.