వాడపల్లి ఆలయంలో 'ధర్మపథం' కూచిపూడి నృత్య ప్రదర్శన

1523చూసినవారు
ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం 'నాట్యవేద కూచిపూడి డాన్స్ అకాడమీ' ఆధ్వర్యంలో 'ధర్మపథం' కార్యక్రమం వైభవంగా జరిగింది. కాకినాడకు చెందిన ఈ అకాడమీ కళాకారులు ప్రదర్శించిన సాంప్రదాయ కూచిపూడి నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. స్వామివారి సన్నిధిలో జరిగిన ఈ సాంస్కృతిక ప్రదర్శనను పలువురు భక్తులు, ఆలయ అధికారులు తిలకించి కళాకారులను అభినందించారు.

సంబంధిత పోస్ట్