77 మందికి రూ. 44. 82 లక్షల సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

1106చూసినవారు
కొత్తపేట మండలానికి చెందిన 77 మంది లబ్ధిదారులకు ఆదివారం రూ. 44,82,367 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయంలో పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ఈ సహాయనిధి ఎంతో ఊరటనిస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తూ ప్రజలకు అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్