ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ శనివారం కోనసీమలోని వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. శేఖర్ మాస్టర్ స్వామి వారి మూలవిరాట్టును దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి, స్వామి వారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను బహూకరించారు. స్థానికులు, భక్తులు ఆయనను చూసేందుకు ఆసక్తి కనబరిచారు.