వాడపల్లిలో వైభవంగా చక్రస్నానం: భక్తుల గోవింద నామస్మరణ

657చూసినవారు
ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాల్లో భాగంగా గురువారం చక్రస్నానం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారిని ఊరేగింపుగా గోదావరి నదికి తీసుకెళ్లి, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ వేడుకలో ఆలయ ఛైర్మన్ వెంకటరాజు, ఈవో చక్రధరరావుతో పాటు వేలాదిగా భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మారుమోగాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్