కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గురువారం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా నిర్మిస్తున్న అన్నదాన భవన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదం అందించాలన్న సంకల్పంతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నామని, నిర్మాణ పనులు నాణ్యతతో, గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్ర అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడా రాజీ పడబోమని, భక్తుల సౌకర్యార్థం అన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.