మెర్లపాలెం మార్గంలో విద్యుత్ దీపాల ఏర్పాటు

315చూసినవారు
కోనసీమలోని వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. మెర్లపాలెం నుండి వాడపల్లికి వెళ్లే మార్గంలో రాత్రిపూట భక్తులు ఇబ్బంది పడకుండా శాశ్వత ఎలక్ట్రికల్ లైట్లను శనివారం ఏర్పాటు చేశారు. ఆలయ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధర్ రావు ఆధ్వర్యంలో ఈ పనులు పూర్తి కావడంతో చీకటి సమస్య తొలగి, భక్తులు సురక్షితంగా ప్రయాణించే వీలు కలిగింది. భక్తులు ఈ సౌకర్యాన్ని హర్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్