పినపళ్లలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

368చూసినవారు
కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గురువారం ఆలమూరు మండలం పినపళ్లలో రూ. 1.08 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందులో రూ. 42.20 లక్షలతో జల జీవన్ మిషన్ కుళాయిలు, రూ. 36 లక్షలతో హెల్త్ క్లినిక్, మరియు రూ. 30 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ఉన్నాయి. కూటమి ప్రభుత్వ పాలనలో పల్లెలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని, ప్రతి గ్రామానికి మౌలిక వసతులు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జ్ బండారు శ్రీనివాసరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్