కొత్తపేట నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం బుధవారం నర్సిపూడిలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో జరిగింది. నియోజకవర్గవ్యాప్తంగా 42వేల మందికి రూ. 18.26 కోట్ల పింఛన్లు పంపిణీ చేశారు. దేశంలోనే అత్యధికంగా రూ. 4వేల పింఛను అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, పేదల సంక్షేమమే ఎన్డీయే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే తెలిపారు. దివ్యాంగులకు రూ. 6వేలు, ఇతరులకు రూ. 15వేల వరకు పింఛన్లు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని పేర్కొన్నారు.