రావులపాలెం: కాలువలోకి దూసుకెళ్లిన కారు.. వ్యక్తి సురక్షితం

1307చూసినవారు
రావులపాలెం: కాలువలోకి దూసుకెళ్లిన కారు.. వ్యక్తి సురక్షితం
రావులపాలెం మండలం గోపాలపురం వద్ద సోమవారం కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. పొడగట్లపల్లి వైపు నుంచి వస్తున్న విద్యుత్ శాఖ ఉద్యోగి కాకి నరేష్, గోపాలపురం సచివాలయం సమీపంలో వాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కాలువలో పడిపోయాడు. అదృష్టవశాత్తు కాలువలో నీటి సరఫరా నిలిపివేయడంతో నరేష్ ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్