కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం ఎస్సీ సెల్ అధ్యక్షులు కోనాల అంబేద్కర్ మృతి పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. రావులపాలెంలోని అంబేద్కర్ స్వగృహాన్ని సందర్శించిన ఎమ్మెల్యే, ఆయన పార్థివదేహంపై పార్టీ జెండాను కప్పి పూలమాలలతో నివాళులర్పించారు. ఎస్సీల హక్కుల కోసం, పార్టీ అభివృద్ధి కోసం అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. ఒక బలమైన నాయకుడిని కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తూ, మృతుడి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.