రికార్డు స్థాయిలో వాడపల్లి ఆదాయం

511చూసినవారు
కోనసీమలోని వాడపల్లి వేంకటేశ్వర స్వామి క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 1,30,822 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ సేవా టిక్కెట్లు, ప్రసాదాల విక్రయాలు, విరాళాల ద్వారా ఆలయానికి రూ. 72,24,343 ఆదాయం లభించింది. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లో 1165 మంది సేవలు పొందారు. అన్నదాన కార్యక్రమాలకు కూడా భక్తులు భారీగా విరాళాలు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్