రావులపాలెంలో హైవే ఆక్రమణల తొలగింపు

808చూసినవారు
రావులపాలెంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్నారు. నేషనల్ హైవే అథారిటీ, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా జేసీబీలతో ఈ పనులు చురుగ్గా సాగుతున్నాయి. హైవే అధికారి సత్యనారాయణరెడ్డి బుధవారం తెలిపిన వివరాల ప్రకారం, ఆక్రమణల తొలగింపు మరో వారం రోజుల పాటు కొనసాగుతుంది. ఈ చర్యల వల్ల రాకపోకలకు అంతరాయం కలిగించే అడ్డంకులు తొలగి ట్రాఫిక్ సులభతరం అవుతుందని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్