కొత్తపేట నియోజకవర్గానికి రూ. 13. 85 కోట్ల నిధుల మంజూరు

504చూసినవారు
కొత్తపేట నియోజకవర్గానికి రూ. 13. 85 కోట్ల నిధుల మంజూరు
కొత్తపేట నియోజకవర్గంలో 54 అభివృద్ధి పనుల కోసం రూ. 13.85 కోట్ల ఉపాధి హామీ (MGNREGS) నిధులు మంజూరయ్యాయి. ఆలమూరుకు రూ. 3.88 కోట్లు, రావులపాలేనికి రూ. 3.60 కోట్లు, కొత్తపేటకు రూ. 3.22 కోట్లు, ఆత్రేయపురానికి రూ. 3.15 కోట్లు కేటాయించారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కృషితో ఈ నిధులు మంజూరయ్యాయి. గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు ఎమ్మెల్యే బండారు బుధవారం కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్