కొత్తపేటలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

128చూసినవారు
కొత్తపేట నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పార్టీ జెండాను ఆవిష్కరించి, వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులర్పించారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఆశయాల సాధనకు ప్రతి కార్యకర్త పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్