వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న వీరూపాక్ష పీఠాధిపతి

1527చూసినవారు
కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని జగద్గురు శంకర దత్తాత్రేయ మహాసంస్థానం, శ్రీనగరి వీరూపాక్ష పీఠాధిపతులు విద్యా నరసింహ భారతి స్వామి వారు సోమవారం దర్శించుకున్నారు. స్వామి వారు వేంకటేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. దేవస్థాన చైర్మన్ ముదునూరి వెంకటరాజు పీఠాధిపతులకు స్వామి వారి చిత్రపటాన్ని, మహాప్రసాదాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్