చంద్రగ్రహణం కారణంగా కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం మంగళవారం ఉదయం 9 గంటలకు మూసివేయబడింది. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం గ్రహణ సమయంలో ఆలయ ద్వారాలు మూసివేసి, అన్ని సేవలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. గ్రహణం ముగిసిన తర్వాత, బుధవారం ఉదయం ప్రత్యేక సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అనంతరం ఉదయం 6 గంటల నుండి భక్తులకు స్వామి వారి దర్శనాలు యథావిధిగా పునఃప్రారంభం అవుతాయని, భక్తులు ఈ సమయ మార్పును గమనించాలని సూచించారు.