వాడపల్లి వెంకన్న కళ్యాణం.. సాయంత్రం 6: 15కు వేడుక ప్రారంభం

401చూసినవారు
ఆత్రేయపురం మండలం వాడపల్లి క్షేత్రంలో కోనసీమ తిరుమల వేంకటేశ్వర స్వామి వార్షిక దివ్య కల్యాణోత్సవం ఆదివారం సాయంత్రం 6:15 గంటలకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ వర్గాలు కోరాయి. కల్యాణోత్సవానికి సంబంధించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈఓ సూర్య చక్రధర్ రావు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. వేడుక దృష్ట్యా ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్నాయి.

సంబంధిత పోస్ట్