వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి రూ. 71. 16 లక్షల ఆదాయం

459చూసినవారు
కోనసీమ తిరుమలగా పేరొందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఒకేరోజు 73,781 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. లడ్డూ ప్రసాదం, ప్రత్యేక దర్శనాలు, ఆన్‌లైన్ సేవల ద్వారా దేవస్థానానికి రూ. 71,16,502 ఆదాయం సమకూరింది. అన్నదాన విరాళాలుగా రూ. 3.52 లక్షలు, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ. 10.20 లక్షలకు పైగా ఆదాయం వచ్చింది. భక్తుల సౌకర్యార్థం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 819 మందికి ఉచిత వైద్య సేవలు అందించారు.

సంబంధిత పోస్ట్