టీడీపీ కార్యకర్త కుటుంబానికి ప్రమాద బీమా పత్రం అందజేత

3చూసినవారు
టీడీపీ కార్యకర్త కుటుంబానికి  ప్రమాద బీమా పత్రం అందజేత
కొవ్వూరు మండలం చిడిపి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త బొల్లా వెంకటేశ్వరరావు గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగి ఉండటంతో, పార్టీ సభ్యత్వం ద్వారా లభించిన రూ. 5, 00, 000/- ప్రమాద బీమా మొత్తానికి సంబంధించిన పత్రాలను కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు చిడిపి గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి, ఆయన సతీమణి బొల్లా ఆదిలక్ష్మి కి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్