కొవ్వూరులో బిజెపి విజయంపై విజయోత్సవాలు

12చూసినవారు
కొవ్వూరులో బిజెపి విజయంపై విజయోత్సవాలు
కొవ్వూరు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసిన పిల్లలమర్రి మురళీకృష్ణ, 26వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసిన పిక్కి నాగేంద్ర ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా విజయం సాధించిన ఇరువురు నాయకులకు పలువురు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇరువురు విజేతలను దుశ్శాలువా, పార్టీ కండువాలతో ఘనంగా సత్కరించారు. ప్రజల విశ్వాసంతో విజయం సాధించిన నాయకులు కొవ్వూరు అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తూ, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్