ధాన్యం కొనుగోళ్లకు పూర్తి ఏర్పాట్లు: కలెక్టర్ కీర్తి చేకూరి

752చూసినవారు
ధాన్యం కొనుగోళ్లకు పూర్తి ఏర్పాట్లు: కలెక్టర్ కీర్తి చేకూరి
తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. మండలంలో ఇప్పటికే 50 శాతం కోతలు పూర్తయ్యాయని, మిగిలిన పంటలు కూడా కోతలకు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. అనంతరం పిహెచ్సి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్