కొవ్వూరు రైల్వే అండర్పాస్ బ్రిడ్జి వద్ద బుధవారం కురిసిన వర్షాలకు భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా, పల్లపు ప్రాంతంలో ఉన్న అండర్పాస్ కిందకు నీరు చేరి మోకాళ్ల లోతుకు చేరుకుంది. దీంతో ప్రమాదకర పరిస్థితుల్లో రాకపోకలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది. అధికారులు తక్షణమే స్పందించి నిలిచిన నీటిని తొలగించి, ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.