అంగన్ వాడీ కేంద్రాల తనిఖీ: రీజనల్ డైరెక్టర్ సుజాతా రాణి సంతృప్తి

564చూసినవారు
అంగన్ వాడీ కేంద్రాల తనిఖీ: రీజనల్ డైరెక్టర్ సుజాతా రాణి సంతృప్తి
ఏలూరు రీజనల్ డైరెక్టర్ సుజాతా రాణి బుధవారం చాగల్లు మండలంలోని ICDS ఆధీనంలో నడుస్తున్న అంగన్ వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోడ్ నంబర్ 63 (పి. విజయకుమారి) మరియు కోడ్ నంబర్ 65 (పి. వెంకట లక్ష్మీ) కేంద్రాల నిర్వహణ పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం బ్రాహ్మణ గూడెం లోని అంగన్ వాడీ కేంద్రాలను కూడా ఆమె సందర్శించారు. ఈ తనిఖీల్లో కొవ్వూరు CDPO నాగలక్ష్మి, సెక్టార్ సూపర్ వైజర్ P V పద్మావతి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్