కాపురం గ్రామంలో నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు: దీర్ఘకాలిక సమస్య పరిష్కారం

869చూసినవారు
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపురం గ్రామంలో విద్యుత్ శాఖ అధికారులు శుక్రవారం నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. దొమ్మేరు పొలిమేర నుంచి దామోదర కుటీరం, అంబేద్కర్ సెంటర్, కాపవరం జంక్షన్ వరకు శిథిలావస్థలో ఉన్న పాత స్తంభాలను తొలగించి, వాటి స్థానంలో కొత్తవి అమర్చారు. ఈ చర్యతో గ్రామస్తుల దీర్ఘకాలిక సమస్య పరిష్కారమైందని, వారు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్