ఎస్ఎంసీ చైర్మన్‌గా కాసింశెట్టి బాలకృష్ణ ఎన్నిక

2చూసినవారు
ఎస్ఎంసీ చైర్మన్‌గా కాసింశెట్టి బాలకృష్ణ ఎన్నిక
కొవ్వూరు మండలం ఐ. పంగిడి గ్రామ జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగిన పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపించాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన శ్రేణులు పోటీ పడగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు చౌటుపల్లి శివ బలపరిచిన ప్యానెల్ విజయం సాధించింది. శివ బలపరిచిన 15 మంది అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. కాసింశెట్టి బాలకృష్ణ ఎస్ఎంసీ చైర్మన్‌గా, ఆరేపల్లి కనకదుర్గ వైస్ చైర్మన్‌గా, డిఎన్ఎల్ ప్రసాద్ పూర్వ విద్యార్థి ప్రతినిధిగా ఎన్నికయ్యారు. జనసేన ఇంచార్జ్ టీవీ రామారావు విజేతలను అభినందించారు.

సంబంధిత పోస్ట్