కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు

793చూసినవారు
కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు
కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 10.30 గంటలకు చాగల్లులోని గవర్నమెంట్ హై స్కూల్‌లో నిర్వహించే ఐ క్యాంప్‌ను సందర్శిస్తారు. అనంతరం, ఉదయం 11.30 గంటలకు చాగల్లు గ్రామంలో స్వచ్ఛ రథాన్ని ప్రారంభిస్తారు. చాగల్లు మండలంలోని ఊనగట్ల, నెలటూరు, మల్లవరం, కలవలపల్లి, చంద్రవరం, చాగల్లు, బ్రాహ్మణగూడెం, దారవరం గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తారు. ఈ కార్యక్రమాలకు NDA కూటమి నాయకులు, కార్యకర్తలు తప్పక హాజరుకావాలని కోరారు.

సంబంధిత పోస్ట్